Shanghai Summer School (BRICS Program) 2026 — Applications close Apr 30 (Beijing Time)

Deadline in Loading...
View Program

PM Modi | మరోసారి రష్యా పర్యటనకు ప్రధాని మోదీ.. నాలుగు నెలల్లో రెండోసారి

PM Modi | మరోసారి రష్యా పర్యటనకు ప్రధాని మోదీ.. నాలుగు నెలల్లో రెండోసారి
Countries
Cooperation areas

Source: Namasthe Telangana | Original Published At: 2024-10-18 08:44:34 UTC

Key Points

  • ప్రధాని మోదీ అక్టోబర్ 22-23 రష్యా పర్యటన
  • 16వ బ్రిక్స్ సమ్మిట్లో పాల్గొనడం
  • రష్యా అధ్యక్షుడు పుతిన్ ఆహ్వానం మేరకు
  • నాలుగు నెలల్లో రెండోసారి రష్యా పర్యటన

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) మరోసారి రష్యా (Russia) పర్యటనకు వెళ్లనున్నారు. రష్యా అధ్యక్షుడు పుతిన్ (Vladimir Putin) ఆహ్వానం మేరకు కజాన్ (Kazan)లో ఈనెల 22 నుంచి 24 వరకూ జరగనున్న 16వ బ్రిక్స్ సమ్మిట్ (BRICS Summit)లో పాల్గొననున్నారు. ఇందులో భాగంగా అక్టోబర్ 22 నుంచి 23 వరకూ రష్యాలో పర్యటించనున్నారు. ఈ విషయాన్ని భారత విదేశాంగ శాఖ తెలిపింది. ఈ పర్యటన సందర్భంగా మోదీ.. బ్రిక్స్ సభ్యదేశాల అధినేతలతో ద్వైపాక్షిక చర్చలు నిర్వహిస్తారని పేర్కొంది.

కాగా, నాలుగు నెలల్లో ప్రధాని మోదీ రష్యా పర్యటనకు వెళ్లడం ఇది రెండోసారి. ఈ ఏడాది జులై 8 – 9 తేదీల్లో ఆయన రష్యాలో పర్యటించిన విషయం తెలిసిందే. ఉక్రెయిన్పై రష్యా దండయాత్ర తర్వాత మాస్కోలో తొలిసారి పర్యటించారు. 22వ భారత్ – రష్యా వార్సిక శిఖరాగ్ర సమావేశంలో పాల్గొన్నారు. అదేవిధంగా రష్యాలోని భారత సంతతి ప్రజలతో కూడా ప్రధాని మోదీ సమావేశం అయ్యారు.

Scroll to Top